నేడు గురుమా సనాతన సత్సంగ్

25-10-2026 | 05:10am
  1. ప్రముఖ నేపథ్య గాయని నీరజా పండిట్ భక్తి గీతాలాపన
  2. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో నిర్వహణ   

హైదరాబాద్, అక్టోబర్ 24(విజయక్రాం తి): గురుమా ఆధ్వర్యంలో సనాతన సత్సం గ్, బాలీవుడ్ నేపథ్య గాయని నీరజా పండిట్(Bollywood playback singer Neeraja Pandit ) భక్తి గీతాల కార్యక్రమం ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని గోల్డెన్ టెంపుల్ (హరే రామ హరే కృష్ణ)లో నిర్వహించనున్నారు. రోడ్ నంబర్ 12, ఎమ్మెల్యే కాలనీ, కమిషనర్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఈ వేదికలో జరిగే కార్య క్రమానికి భక్తులు, ఆధ్యాత్మిక సాధకులు హా జరుకానున్నారు. ఈ సత్సంగ్ ప్రధాన ఉద్దే శం ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడం,

అంతరంగ శాంతిని సాధించే మా ర్గాలను పరిచయం చేయడం, సనాతన ధ ర్మంలోని విలువలను ప్రజలకు చేరువ చే యడం. గురుమా ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంతో పాటు నీరజా పండిట్ ఆలపించే భక్తి గీతాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ని లవనున్నాయి.  ఈ కా ర్యక్రమం శూన్యో జీ మహారాజ్, గురుమా ఆధ్యాత్మిక బోధనలు, సంప్రదాయాలకు అ నుబంధంగా నిర్వహించబడుతోంది.  కార్యక్రమ నిర్వాహకులు ఆచార్య శంకర్‌లాల్ అగర్వాల్ మాట్లాడుతూ, ప్రజలను ఆధ్యాత్మికతకు చేరువ చేయడం,

అంతరంగ శాంతిని పెంపొందించడం, సనాతన ధర్మంలోని శాశ్వత విలువలను అందరికీ పరిచయం చే యడమే ఈ సత్సంగ్ ముఖ్య ఉద్దేశం అ న్నా రు. హైదరాబాద్, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. ఇదే ఆధ్యాత్మిక కార్యక్రమాల పరంపరలో మరో సత్సంగ్‌ను ఈ నెల 27న ఉదయం 10 గంటలకు హనుమకొండ, రాజ్‌పుట్‌వాడిలో ఉన్న రాధాస్వామి జనరల్ సత్సంగ్ ప్రాంగణంలో నిర్వహిం చనున్నారు. 


మరిన్ని వార్తలు