వాయుగుండం ఎఫెక్ట్
బంగాళాఖాతంలో తుఫాన్.. తెలంగాణకు భారీ వర్ష సూచన
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ తుఫాన్‌గా మారనుండటంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. శనివారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా మారిన ఈ Weather System.. రాత్రికి వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సోమవారం ఉదయానికి Cycloneగా రూపాంతరం చెంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అనంతరం మరింత బలపడి ఈ నెల 28న తీరం దాటే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే జిల్లాల వారీగా Weather Alerts జారీ చేసింది. అక్టోబర్ 27న Yellow Alert, 28న పలు జిల్లాలకు Red Alert, Orange Alert ప్రకటించగా.. 29న Yellow Alert కొనసాగనుంది. ముఖ్యంగా 28న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో Red Alert జారీ చేశారు.
భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జిల్లాలకు Orange Alert ప్రకటించారు. తుఫాన్ కదలికలు, వర్షాల తీవ్రతలో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు తాజా Weather Updates గమనించాలని సూచిస్తున్నారు. భారీ వర్షాల సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారుల సూచనలు పాటిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.