ఎల్ నినోపై రాజకీయాలు వద్దు

25-10-2026 | 05:25am
  1. ప్రతి నాయకుడు ప్రజలకు అండగా నిలవాలి
  2. ఈ సమయంలో విమర్శలు చేయడం విచారకరం
  3. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖమ్మం, అక్టోబర్ 24 (విజయక్రాంతి): ఎల్ నినో వంటి ప్రకృతి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదు.. ప్రజలకు అండగా నిలవడమే రాజకీయ పార్టీల బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న వే ళ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చే యడం విచారకరమని వ్యాఖ్యానించారు.

ప్రజలకు మేలు చేసే సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్షాలు విమర్శలకే పరిమితం కావడం సమంజసం కాదన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మం డలం కొదుమూరు గ్రామంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడా రు. సూపర్ ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని ప్రతి ఒక్కరూ పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాబోయే నెలల్లో తా గునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా చెరువులు, కుంటలు, జలాశయాల్లో మిగిలి ఉన్న నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని  తెలిపారు. 2014 లో రాష్ట్ర విభజన సమయంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 6,648 మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం 20,018 మెగావాట్లకు చేరిందన్నారు. 2023లో 15,497 మెగావాట్లుగా ఉన్న గరిష్ఠ డిమాండ్ 2025లో 17,162 మెగావాట్లకు పెరిగిందని, ప్రస్తుతం మరింత అధిక స్థాయికి చేరిందని చెప్పారు.

సాధారణంగా విద్యుత్ డిమాండ్ ఏటా 6 నుంచి 6.5 శాతం పెరుగుతుండగా, ఈ ఏడాది అక్టోబర్లో దాదాపు 25 శాతం పెరుగుదల నమోదైందన్నారు. గతేడాది అక్టోబర్లో రోజువారీ విద్యుత్ వినియోగం 245.35 మిలియన్ యూనిట్లు ఉండగా, ఈ ఏడాది అక్టోబరులో 335.05 మిలియన్ యూనిట్లకు చేరిందన్నారు. ఇది సుమారు 37 శాతం పె రుగుదల అని వివరించారు. అక్టోబర్‌కు సంబంధించిన మరో విద్యుత్ వినియోగ గణాంకంలో 5,108 నుంచి 9,577కు పెరుగుదల నమోదైందని, ఇది 87.50 శాతమని పేర్కొన్నారు.

ఎండల తీవ్రతతో ఇళ్లలో విద్యుత్ వినియోగం పెరగడంతో పాటు వ్యవసాయ పంపుసెట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల అవసరాలు పెరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి పెంచడం ఒకవైపు, ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను అంతరాయం లే కుండా ప్రజలకు చేరవేయడం మరోవైపు కీలకమని అన్నారు. పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో విద్యుత్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తోందన్నారు.

రాష్ట్రంలో సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండగా, వాటిలో దాదాపు 15 లక్షల పంపుసెట్ల పరిధిలో భూగర్భ జలాల కొరత ఏర్పడిందని తెలిపారు. బోర్లలో నీరు లేకపోయినా మో టార్లు ఆన్ చేయడం వల్ల అవి కాలిపోవడ మే కాకుండా, విద్యుత్ లోడ్ పెరిగి ట్రాన్స్ఫార్మర్లపైనా ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భూగర్భ జలాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో రైతులు వ్యవసా య మోటార్లను ఆన్ చేయవద్దని కోరారు.

రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో వినియోగానికి అందుబాటులో ఉన్న నీటి నిల్వలు త గ్గాయని భట్టి విక్రమార్క తెలిపారు. మొత్తం 470.22 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి సంబంధించి ప్రస్తుతం 178.60 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44,034 చెరువుల్లో దాదాపు 40 శాతం చెరువుల్లో పావు వంతు కంటే తక్కువ నీరు ఉందన్నారు. ఈ ప రిస్థితుల్లో ఉన్న నీటిని విచ్చలవిడిగా వినియోగించకుండా తాగునీటి అవసరాలకు ప్రా ధాన్యం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఉపాధి హామీ  కింద ఇప్పటికే 9.1 లక్షల పనులను గుర్తించామని, అదనంగా మరో ౮లక్షల పనులను గుర్తించేలా చర్యలు చేపట్టామన్నారు.

మరిన్ని వార్తలు