మహాకాళేశ్వరుడి సన్నిధిలో క్రికెటర్లు.. భస్మ హారతిలో చాహల్
ఉజ్జయిని: క్రికెట్ మైదానంలో తమ ఆటతో అభిమానులను అలరించే స్టార్ ఆటగాళ్లు ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని భారత క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, నితీష్ రాణా, రాహుల్ తెవాటియా తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసిద్ధ భస్మ హారతిలో పాల్గొన్నారు.
మహాకాళేశ్వరుడి దర్శనం అనంతరం నితీష్ రాణా తన అనుభవాన్ని పంచుకున్నారు. మహాకాలుడి ఆశీస్సులు పొందేందుకు ప్రతి ఒక్కరూ వీలైనప్పుడు ఆలయాన్ని సందర్శించాలని సూచించారు. ఆలయంలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.
మహాకాలుడు పిలిచినప్పుడల్లా తాను ఇక్కడికి వస్తుంటానని రాణా తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలని, యువత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తమలాంటి క్రికెటర్లు కూడా కెరీర్లో మరింత పురోగతి సాధించాలని మహాకాళేశ్వరుడిని ప్రార్థించినట్లు వెల్లడించారు. క్రికెట్ స్టార్స్ ఆలయ సందర్శనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.