ఓటు ఎవరివైపు..?ఆరు సీట్లపై ఉత్కంఠ!
దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న ఆరు ఉప ఎన్నికలకు (By-Elections) మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. పశ్చిమ బెంగాల్ (West Bengal), తమిళనాడు (Tamil Nadu), అస్సాం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రజాప్రతినిధులు ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి, ఒక స్థానానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రెజినగర్ స్థానాలపై అందరి దృష్టి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. నందిగ్రామ్‌లో బీజేపీ (BJP) అభ్యర్థిగా హసిరాణి రాథ్ బరిలో ఉన్నారు. మరోవైపు ప్రతిపక్షాల మధ్య భిన్నమైన రాజకీయ సమీకరణాలు కనిపిస్తున్నాయి.
తమిళనాడులోని మధురాంతకం, ధారపురం స్థానాల్లో టీవీకే, డీఎంకే, ఏఐఏడీఎంకే, సీపీఐ మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండటంతో ఓట్ల చీలిక (Vote Split) ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పుదుచ్చేరిలోని తట్టన్‌చావడి, అస్సాంలోని నాగావ్ లోక్‌సభ స్థానాల్లోనూ పోలింగ్ జరగనుంది. ఆయా ప్రాంతాల్లో అధికార, ప్రతిపక్ష కూటముల బలబలాలకు ఈ ఎన్నికలు పరీక్షగా నిలవనున్నాయి. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు (Vote Counting) చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.