విద్యుత్ స్తంభాల వద్ద షాక్.. చెట్లపై వేలాడుతున్న వైర్లు

25-09-2026 | 09:58am

ప్రమాదం పొంచి ఉందంటున్న వర్తమన్నూర్ గ్రామస్థులు

ఇచ్చోడ సెప్టెంబర్ 25: విజయక్రాంతి: ఆదిలాబాద్ జిల్లా వర్తమన్నూర్ గ్రామంలోని స్థానిక హనుమాన్ టెంపుల్ సమీపంలో విద్యుత్ స్తంభాల వద్ద షాక్(Electric shock ) వస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు చెట్లపై నుంచి వేలాడుతూ ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హనుమాన్ టెంపుల్‌కు భక్తులు, గ్రామస్థులు తరచూ రాకపోకలు సాగించే ప్రాంతంలోనే ఈ పరిస్థితి నెలకొనడంతో మరింత అప్రమత్తత అవసరమని స్థానికులు పేర్కొంటున్నారు.

విద్యుత్ స్తంభాలు, వైర్లను వెంటనే పరిశీలించి లోపాలను సరిచేయాలని వారు కోరుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి షాక్ వస్తున్న స్తంభాలను తనిఖీ చేయడంతో పాటు, చెట్లపై ఉన్న విద్యుత్ వైర్లను సురక్షితంగా తొలగించి, ప్రమాద నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు