ప్రధాన రహదారిపై అడ్డంగా పడిన భారీ వృక్షం.. పట్టించుకోని అధికారులు

25-09-2026 | 10:03am

ప్రధాన రహదారిపై అడ్డంగా పడిన భారీ వృక్షం.. పట్టించుకోని అధికారులు

వాహనదారుల ఆవేదన - ప్రమాదాలకు నిలయంగా మారిన రహదారి

నర్మెట, సెప్టెంబర్ 25 ( విజయక్రాంతి): జనగామ జిల్లా నర్మెట మండలంలోని ప్రధాన రహదారిపై అకాల వర్షానికి భారీ చెట్టు కూలిపోయి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. చెట్టు పడిపోయి చాలా గంటలు గడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారికి అడ్డంగా చెట్టు ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించే వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై పడిన చెట్టును తొలగించి, రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు