ఎన్నికల్లోకి AI

25-09-2026 | 09:11am

ఎన్నికల ప్రక్రియలో AI ఎంట్రీ.. ఇక పనులు మరింత ఈజీ!

కోజికోడ్: ఎన్నికల నిర్వహణలో టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచేందుకు కేరళ ఎన్నికల శాఖ(Kerala Election Department) సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ఆధారిత కొత్త సాధనాలు ఎన్నికల ప్రక్రియను మరింత సులభంగా, వేగంగా, సమర్థవంతంగా మార్చగలవని కేరళ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డి. సాజిత్ బాబు(Kerala CEO Sajith Babu) తెలిపారు. కోజికోడ్‌లోని చాతమంగళం EVM గిడ్డంగిని పరిశీలించిన అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఎన్నికల కమిషన్(Election Commission) మార్గదర్శకాల మేరకు అభివృద్ధి చేస్తున్న కొత్త AI ఆధారిత టూల్స్‌ను ఎన్నికల సంబంధిత పనుల్లో సమర్థంగా ఉపయోగించాలని అధికారులకు సూచించారు. సాంకేతికతతో ఎన్నికల ప్రక్రియలోని పలు పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టే అవకాశం ఉందని అధికారులు చర్చించారు. అదే సమయంలో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, పెండింగ్‌లో ఉన్న ఎన్నికల(Kerala elections AI) ఫారాలు తదితర అంశాలపై కూడా సమీక్ష జరిగింది. అంటే.. భవిష్యత్ ఎన్నికల్లో AI టెక్నాలజీ కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు పడుతున్నాయన్నమాట.

మరిన్ని వార్తలు