దేవీ నవరాత్రుల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మట్టా రాగమయి
సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణంలోని 13వ వార్డు జవహర్ నగర్, సింగరేణి కాలనీలలో దేవీ నవరాత్రుల(Devi Navaratri) సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల్లో కొలువుదీరిన అమ్మవారికి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్(MLA Matta Ragamayee Dayanand) రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా. మట్టా దయానంద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మహిళలతో కలిసి కోలాటం ఆడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే తో కలిసి మహిళలు ఆనందోత్సాహాలతో కోలాటం ఆడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి.చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.