పంటల సాగులో ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి
భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్
ములకలపల్లి,(విజయక్రాంతి): ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల సాగులో ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్(Collector Ankit) సూచించారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆధ్వర్యంలో సోమవారం రైతు నేస్తం అనే రైతుల కార్యక్రమాన్ని రైతు వేదికలల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) మాట్లాడుతూ... యాసంగిలో వరి వేసుకోవొద్దని సూచించారు.
ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎల్ నినో తీవ్రత దృష్ట్యా భూగర్భ జలాలు తగ్గుతున్నందున పంటల సాగు వనరుల అందుబాటును బట్టి చేయాలని సూచించారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు మాట్లాడుతూ వ్యవసాయ, ఉధ్యాన,పశు సంవర్ధక, విద్యుత్,గ్రామీణ అభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేసి పౌరులకు ఎల్ ని నో నుండి ఉపశమనం పొందేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ జగన్నాధపురం రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమానికి హాజరై రైతులతో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ ఆదేశానుసారం ఆరుతడి పంటలు,ఆయిల్ పామ్ కూరగాయల సాగు చేసుకోవాలని రైతులను కోరారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విద్య చందన, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు,సహాయ వ్యవసాయ సంచాలకులు రవి కుమార్, మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబు, తహసీల్దార్ స్వాతి బిందు, ఏఈఓ లు,వివిధ జిల్లా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.