పూసుగూడెం గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ

13-10-2026 | 01:52pm

కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

ములకలపల్లి,(విజయక్రాంతి): కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్(CEC Gyanesh Kumar) వెంటనే రాజీనామా చేయాలని, SIR రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం(Telangana Agricultural Workers' Union) జిల్లా సహాయ కార్యదర్శి ముదిగొండ రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం పూసుగూడెం గ్రామంలో కొవ్వొత్తులతో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిన కేంద్ర ఎన్నికల అధికారి సర్ పేరుతో పదమూడు కోట్ల మంది ఓట్లు తొలగించారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఓట్ల తొలగింపు ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తుందన్నారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం, ఎన్నికల అధికారి రాజీనామా చేయాలని, సర్ రద్దు చేయాలని డిల్లీ అఖిలపక్షం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలపై పారా మిలటరీ బలగాలతో దాడులు చేయడం,అరెస్టులు చేయడాన్ని ప్రజలందరూ తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం దేశ వ్యాప్తంగా విస్తరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి రావుజా,శ్రీదేవి,వెంకటేశ్వర్లు, సామిని,వీరు,లక్య,దేవా,భీమా, జగ్గు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు