విజయక్రాంతి కథనానికి అధికారుల స్పందన

25-10-2026 | 02:54pm

బెజ్జూర్, అక్టోబర్ 25 (విజయ క్రాంతి): బెజ్జూర్(Bejjur) మండల కేంద్రంలోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయం ముందు పైపులైన్ లీకేజీ(Pipeline leakage)తో బురద పేరుకుపోతున్న సమస్యపై విజయ క్రాంతి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కార్యాలయం ముందు పైపులైన్ లీకేజీతో బురద పేరుకుపోతున్న విషయాన్ని గుర్తించిన ఎంపీడీవో బండారి ప్రవీణ్ కుమార్, గ్రామపంచాయతీ సిబ్బందికి సూచనలు ఇచ్చి లీకేజీకి మరమ్మతులు చేయించారు.

సమస్య పరిష్కారం కావడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు, సిబ్బందికి ఇబ్బందులు తొలగాయి. ప్రజా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన విజయ క్రాంతి దినపత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు