బీబ్రాలో 132 కేవీ సబ్‌స్టేషన్ స్థల పరిశీలన
08-10-2026 | 06:33pm
దహెగాం, అక్టోబర్ 8 (విజయక్రాంతి):మండలంలోని బీబ్రా గ్రామంలో(Beebra Village) ప్రతిపాదిత 132 కేవీ సబ్‌స్టేషన్(KV Substation) నిర్మాణ స్థలాన్ని గురువారం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే పరిశీలించారు. స్థల విస్తీర్ణం, నిర్మాణానికి అనుకూల పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నూతన సబ్‌స్టేషన్ ఏర్పాటుతో భవిష్యత్ విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా మౌలిక వసతులు బలోపేతం కావడంతో పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏఈ, సర్పంచ్, గ్రామస్థులు పాల్గొన్నారు.