విజయ క్రాంతి ఎఫెక్ట్.. స్పందించిన అధికారులు
బెజ్జూర్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఊట్ సారంగపల్లి గ్రామంలో పారిశుధ్యంపై పట్టింపు ఏదీ? అనే కథనం (Sanitation Issues) విజయక్రాంతి దినపత్రికలో ప్రచురితమైన నేపథ్యంలో అధికారులు స్పందించారు (Officials Respond). మండల అధికారులు ఎంపీడీవో బండారి ప్రవీణ్ కుమార్, ఎంపీఓ గురజాల శ్రీనివాస్ గ్రామంలో నెలకొన్న సమస్యలపై చర్యలు చేపట్టారు.
గ్రామ సర్పంచ్ శ్రీహరి దగ్గరుండి గ్రామంలోని మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, మట్టిని తొలగించి శుభ్రం చేయించారు (Drainage Cleaning). మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీలను సైతం సర్పంచ్, గ్రామ కార్యదర్శి ధర్మయ్య దగ్గరుండి మరమ్మతులు చేయించారు (Pipeline Repairs).గ్రామంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కారం లభించిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేసిన విజయక్రాంతి దినపత్రిక యాజమాన్యానికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.