నవంబర్ 2న కొమురం భీం వర్ధంతి వారోత్సవాలు
బెజ్జూర్ అక్టోబర్ 28 (విజయ క్రాంతి ): బెజ్జూర్ మండలంలోని ఆదివాసి భవనంలో ఆదివాసి సంఘం అధ్యక్షులు కోరేత తిరుపతి(Koreta Tirupati, President of the Adivasi Association) అధ్యక్షతన జరిగిన ఆదివాసి ఆరాధ్యులు కొమరం భీం వర్ధంతి కార్యక్రమం సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి పెద్దలు ఆదివాసి సర్పంచులు,ఆదివాసి ఉద్యోగ ఉపాధ్యాయులు,
మహిళా సంఘాలు,ఆదివాసి యువత అందరూ కలిసి నవంబర్ 2 న కొమరం భీం వర్ధంతి వారోత్సవాలు నిర్వహించుటకు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బెజ్జూరు మండలంలోని అన్ని గ్రామాలనుండి ఆదివాసులు అధిక సంఖ్యలో పాల్గొని కొమురం భీం వారోత్సవాలా కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు సిడం సకారం, తొర్రెమ్ బానయ్య, కుమ్రం హన్మంత్, ఆత్రం బక్కయ్య, ఏనుక శంకర్, తలండి తిరుపతి, తలండి రాములు,ఆత్రం సాయి, బండి రాజారామ్ తదితరులు పాల్గొన్నారు.