29వ సారి రక్తదానం.. మానవత్వం చాటుకున్న కీర్తి శ్యాం కుమార్
19-09-2026 | 06:21pm
ఆసిఫాబాద్(విజయ క్రాంతి): బూరుగుడకు చెందిన గంధం వనజకు ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో(Asifabad Government Hospital)చికిత్స నిమిత్తం అత్యవసరంగా O+ve రక్తం అవసరమైంది. విషయం తెలుసుకున్న ఆసిఫాబాద్ పట్టణంలోని సందీప్నగర్కు చెందిన కీర్తి శ్యాం కుమార్ ఒక్క ఫోన్ కాల్తో స్పందించి వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం (బ్లడ్ బ్యాంక్)కు చేరుకుని రక్తదానం చేశారు.ఇది ఆయన 29వ సారి రక్తదానం కావడం విశేషం. అత్యవసర సమయంలో స్పందించి రక్తదానం చేసిన శ్యాం కుమార్ను పలువురు అభినందించారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని కోరారు.