కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపేందుకే ఇంద్రవెల్లి సభ
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఇంద్రవెల్లిలో పాంచజన్య సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) బెల్లంపల్లి ఇన్చార్జి, మాజీ మంత్రి బోడ జనార్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కిరిమిళ్ల వినోద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటి పరంగా అన్యాయం జరిగిందని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, రహదారుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. రైతుల సమస్యలపై బీఆర్ఎస్ ప్రశ్నించడం లేదని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడేందుకే కవిత అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రారంభమైందన్నారు.
ఇంద్రవెల్లి సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 2 వేల మందికి పైగా కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి కావేటి సబిత, అశోక్, కావేటి మనోహర్, కిషన్ నాయక్, శ్యామ్రావు తదితరులు పాల్గొన్నారు.