తొలి సోలార్ విద్యుత్ కేంద్రం బెజ్జూర్ లో ప్రారంభం

17-10-2026 | 09:52pm

 బెజ్జూర్ అక్టోబర్ 17(విజయ క్రాంతి): బెజ్జూర్ మండల(Bejjur Mandal) కేంద్రంలో రెండు మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన విద్యుత్ కేంద్రాన్ని శనివారం ఎస్ఈ ఉత్తమ్ జాడే, డీఈ నాగరాజు(DE Nagaraju) ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ విద్యుత్ కేంద్రం ద్వారా ప్రతిరోజూ సుమారు 10 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి(Electricity Generation) అవుతుందని తెలిపారు. ఈ కేంద్రం మండల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. జిల్లాలో ప్రయివేట్ రంగంలోతొలిసారిగా ఈ తరహా సోలార్ విద్యుత్(Solar electricity) కేంద్రాన్ని ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.

సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా విద్యుత్ సరఫరాకు తోడ్పాటు అందించడంతో పాటు సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇటువంటి కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం సోలార్ విద్యుత్ కేంద్రం నిర్వాహకుడు నాగ వెంకట గిరీష్ మాట్లాడుతూ తాను చేసే ప్రతి పని దేశం, రైతులకు(Farmers) ఉపయోగపడే విధంగా ఉంటుందన్నారు. తాను చేసే ప్రతి వ్యాపారంలో ఈ రెండు కచ్చితంగాఉంటాయన్నారు.

మండల ప్రజలు తనకు ఎంతగానో సహకరించారని, రాబోవు కాలంలో రైతులకు ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు చేస్తామన్నారు. తండ్రి లేని పేద విద్యార్థికి ప్రతినెల రూ.1000 స్కాలర్షిప్ అందించడంతోపాటు విద్యార్థిననులకు సైకిళ్లను పంపిణీ చేస్తామన్నారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీ డీఈ వీరేశం, టెక్నికల్ డీఈ సుధాకర్, ఏఈ అంజల్ కుమార్, సిబ్బంది దుర్గం శంకర్, సాయి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు