రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
బెజ్జూర్ అక్టోబర్ 8 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండలంలోని సలగుపల్లి పల్లె ప్రకృతి వనం(Village Nature Park) సమీపంలో ని మూలమలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Horrific road accident) జరిగింది. ఇట్టి విషయం గ్రామ ప్రజలు ఎస్సై రమేష్ కు సమాచారం అందించడంతో పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మండలంలోని రేచిని గ్రామానికి చెందిన నికూరి అనంతరావు, నికూరి మల్లయ్య, నీకూరి రాజయ్య, కాగజ్ నగర్ వెళ్లి తిరుగు ప్రయాణం ఇంటికి వస్తున్న క్రమంలో పల్లె ప్రకృతి వనం మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు కింద పడిపోయింది. దీనితో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు కింద పడిపోయారు.
నికూరి రాజయ్యకు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నికూరి అనంతరావును గమనించిన బిఆర్ఎస్ నాయకులు అమీరుద్దీన్, వార్డు సభ్యులు నికాడి బాబురావు ప్రజల సహకారంతో అతని మోసుకుంటూ ప్రైవేటు ఆటో లో బెజ్జూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల్ ఆసుపత్రికి తరలించారు.
నీకురి మల్లయ్య ను కాగజ్నగర్ ఆసుపత్రికి తరలించారు. మూల మలుపు వద్ద ఏలాంటి సూచిక బోర్డులు లేకపోవడంతోటే గమనించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. మూలమలుపు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలుమార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. తన కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు.