రైతులు ఎఫ్పీఓలో చేరి ప్రయోజనాలు పొందాలి
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రైతులు రైతు ఉత్పత్తిదారుల సంస్థ(Farmers' Producer Organizations) (ఎఫ్పీఓ)లో సభ్యులుగా చేరి భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను పొందాలని ప్రాథమిక సహకార సంఘం(Primary Cooperative Society) అధ్యక్షుడు అలీ బిన్ హైమద్(Ali bin Haimad) సూచించారు. శుక్రవారం ఆసిఫాబాద్ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో ఎఫ్పీఓ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో రైతులకు అవగాహన కల్పించారు. ప్రతి రైతు రూ.2 వేలు చెల్లించి సభ్యత్వం పొందాలని, ఎన్సీడీసీ ద్వారా అదనంగా రూ.2 వేల వాటా అందించే అవకాశం ఉందని వైస్ చైర్మన్ రుకుమ్ ప్రహ్లాద్ వివరించారు.
సహకార సంఘాన్ని(Cooperative society) ఎఫ్పీఓగా గుర్తించినందుకు రైతుల తరఫున అలీ బిన్ హైమద్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి డైరెక్టర్ 50 మంది రైతులను సభ్యులుగా చేర్పించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి నాగ నారాయణ, ఎఫ్పీఓ డీఈ రాథోడ్ శ్రీధర్, డీసీఓ అసిస్టెంట్ రిజిస్ట్రార్ షాముల్, డైరెక్టర్లు నారా ఆశన్న, బళ్లారపు మధుకర్, రైతులు మిట్టా తిరుపతి, చూసే ధర్మయ్య, వాంకిడి సంఘం కార్యదర్శి ఓ మాజీ, రెబ్బెన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.