తప్పు చేసిన అధికారులకు తిప్పలు.. తప్పవా?

05-10-2026 | 08:06pm

ఫలహారంగా మారిన ప్రభుత్వ పరిహారం?

సింగరేణి,(విజయక్రాంతి): రైల్వే పరిహారాన్ని(Railway Compensation) ఫలహారంగా మార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగరేణి గ్రామపంచాయితీ(Singareni Gram Panchayat) కార్యదర్శి, గ్రామ పాలన రెవెన్యూ అధికారి ఇరువురిపై జిల్లా అధికారుల విచారణలో తప్పు చేసినట్లు తేలితే వారిపై చర్యలు తప్పవా? అనే చర్చ ఇప్పుడు మండలంలో  కొనసాగుతోంది.ఈ వ్యవహారంలో సింగరేణి గ్రామపంచాయతీలో జరిగిన అక్రమాలపై విజయ క్రాంతి దినపత్రికలో ప్రచురితమైన వరుస కథనాలపై జిల్లా అధికారులు కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

అధికారుల సమగ్ర విచారణ అనంతరం అధికారులు ఎలాంటి చర్యలకు ఆదేశాలు జారీ చేస్తారనే ఆసక్తి నెలకొన్నది. రైల్వే శాఖ(Railway Department) విడుదల చేసిన గెజిట్ ఆధారంగానే పరిహారం అందజేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ కేవలం రైల్వే గెజిట్ మాత్రమే ప్రామాణికం కాదని,క్షేత్రస్థాయిలో అధికారులు చేసే విచారణ ఆధారంగానే  ప్రభుత్వ పరిహారం అందజేయాల్సి ఉంటుంది.కానీ క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టకుండా,నిధుల్లో అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవలసిన అధికారులు దేనికి తప్పులకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు