అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే...
30-09-2026 | 10:16pm
తాడ్వాయి,సెప్టెంబర్,30( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. కళాశాలకు మంజూరైన రూ. 10.50 లక్షలతో నిర్వహించిన మరమ్మతు పనులు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ... కళాశాలలో తాగునీటి సమస్య,అదనపు తరగతి గదులు,ప్రహరీ గోడ, ల్యాబ్ గదుల కొరత సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యేకు తెలిపారు.ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.