5 September, 2026 | 1:35 AM

420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌

04-09-2026 | 11:35pm

ఆదిలాబాద్‌ రూరల్,(విజయక్రాంతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress government) 420 హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీపీ గండ్రత్‌ రమేష్‌(Former MPP Gandrath Ramesh) ఆరోపించారు. అభివృద్ధిని విస్మరించి భూ కబ్జాలపై దృష్టి సారిస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర పిలుపులో భాగంగా సాత్రాల ఎక్స్‌రోడ్‌ వద్ద నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తుంచుకున్నారని, రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు అండగా నిలుస్తారని అన్నారు. 

మరిన్ని వార్తలు