నూతన ఎస్సై సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జూపెడ సర్పంచ్

28-10-2026 | 04:34pm

తిరుమలాయపాలెం, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్(Tirumalayapalem Police Station) నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పోగుల సురేష్‌ను జూపెడ గ్రామ సర్పంచ్ వనవాసం నరేందర్ రెడ్డి, టి. శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై సురేష్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలు, గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై చర్చించారు. ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు