తండ్రి జ్ఞాపకార్థం గ్రామానికి వైకుంఠ రథం విరాళం

22-11-2026 | 04:58pm

కూసుమంచి, నవంబర్ 22 (విజయక్రాంతి): తండ్రి జ్ఞాపకార్థం గ్రామ ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాన్ని చేపట్టి జక్కెపల్లి గ్రామ సర్పంచ్ నల్లబోలు చంద్రారెడ్డి తన దాతృత్వాన్ని (Generosity) చాటుకున్నారు. కూసుమంచి మండలం జక్కెపల్లి గ్రామానికి చెందిన తన తండ్రి కీర్తిశేషులు నల్లబోలు భిక్షమారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా గ్రామ ప్రజల అవసరార్థం వైకుంఠ రథాన్ని (Vaikuntha Ratham) విరాళంగా అందించారు.

ఈ వైకుంఠ రథాన్ని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జన్మనిచ్చిన తండ్రి జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేలా గ్రామ ప్రజలకు ఉపయోగపడే వైకుంఠ రథాన్ని విరాళంగా అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు (Social Service) సమాజానికి మేలు చేయడమే కాకుండా ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.

అనంతరం వైకుంఠ రథాన్ని విరాళంగా అందించిన దాత నల్లబోలు చంద్రారెడ్డిని పలువురు నాయకులు, గ్రామ పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు