ఇందిరాగాంధీ 42వ వర్ధంతి ఎమ్మెల్యే మట్టా రాగమయి

31-10-2026 | 06:20pm

భారత తొలి మహిళా ప్రధానమంత్రి

దేశ ఐక్యత, సమగ్రత కోసం ఇందిరాగాంధీ చేసిన కృషి స్మరణ

సత్తుపల్లి,(విజయ క్రాంతి): భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ 42వ వర్ధంతిని పురస్కరించుకుని సత్తుపల్లి పట్టణంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలను, దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆమె చేసిన కృషిని స్మరించుకున్నారు. దేశ అభివృద్ధి కోసం ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ప్రజాసేవ పట్ల ఆమెకు ఉన్న నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ బొంతు సుమలత వేణు, వార్డు కౌన్సిలర్లు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు