జేవీఆర్ ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రహల్లాద్ కి ఘన వీడ్కోలు

31-10-2026 | 07:31pm

సింగరేణి కాంట్రాక్ట్స్  డ్రైవర్స్ అసోసియేషన్

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణం సింగరేణి జేవీఆర్ ఓసి  ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రహల్లాద్(Singareni JVR OC Project Officer Prahalad) పదవి విరమణ(Retirement) పొందుతున్న సందర్భంగా సత్తుపల్లి సింగరేణి కాంట్రాక్ట్స్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలమాలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

 అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ... కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేశారని తెలియజేస్తూ పదవి విరమణ అనంతరం వారి కుటుంబ సభ్యులతో కలిసి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో గడపాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ డైవర్స్ అసోసియేషన్ నాయకులు , కాంట్రాక్ట్ ఉద్యోగులు , ఇతరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు