దూసుకు వెళ్తున్న విపిఎల్ సీజన్-3 ఫైనల్ మ్యాచ్
వెంకటాపురం,(విజయక్రాంతి): వెంకటాపురం మండలంలో కాఫెడ్ మైదానంలో నిర్వహిస్తున్న వెంకటాపురం క్రికెట్ అసోసియేషన్ VCA వెంకటాపురం ప్రీమియర్ లీగ్ సీజన్ 03 లో భాగంగ 12 వరోజు కొనసాగుతున్న క్రికెట్ టోర్నీ సే టు నో డ్రగ్ అనే నినాదంతో దూసుకు వెళ్తున్న విపిఎల్ సీజన్ 3 ఫైనల్ మ్యాచ్ సూర్య కొంగల కింగ్స్ వర్సెస్ హంటర్స్ జరిగిన మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి హంటర్స్ బ్యాటింగ్ ఎంచుకున్నది.
మొదట బ్యాటింగ్ చేసిన హంటర్స్ నిర్ణీత 15 ఓవర్లలో లో 148 పరుగులు చేసింది. 9 వికెట్లు కోల్పోవడం జరిగింది. సెకండ్ బ్యాటింగ్ దిగిన సూర్య కొంగల కింగ్స్ మ్యాచ్లో 10 ఓవర్లలో లోనే 10 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. 78 పరుగుల తేడాతో హంటర్స్ విజయం సాధించిందిఈ మ్యాచ్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 28 బంతుల్లో ఐదు ఫోర్లు ఐదు సిక్స్ తో 66 పరుగులు చేసిననిఖిల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగింది.
ఫైనల్ మ్యాచ్లో హంటర్స్ కి మొదటి బహుమతి ఇచ్చినవారు మన్యం సురేష్ బాబు మన్యం సునీల్ చీఫ్ గెస్ట్ గా విచ్చేసినటువంటి సిఆర్పిఎఫ్ డిఎస్పి ప్రశస్తు సిఐ ముత్యం రమేష్ చేతుల మీదుగా 55555 ఇవ్వడం జరిగింది . రెండవ బహుమతి ఇచ్చిన గోడవర్తి నరసింహమూర్తి సూర్య కొంగల కింగ్స్ కి గంప రాంబాబు ముడుంబ శ్రీనివాసరావు చేతుల 33333 మీదుగా ఇవ్వడం జరిగింది.
మూడో స్థానంలో నిలిచిన సాయి చేయూత సోల్జర్స్ కి 22222 బహుమతి ఇచ్చిన బాచినేని ప్రవీణ్ వడ్డ శ్రీనాథ్ ఇవ్వడం జరిగింది. నాలుగో స్థానంలో మహాలక్ష్మి లెవెల్ కి 11111 బహుమతి దర్గయ్య గారు ఇవ్వడం జరిగిందిఉత్తమ బ్యాటింగ్ ఉత్తమ బౌలింగ్ మరియు ఉత్తమ కీపింగ్ మరియు మ్యాచ్ ఇళ్లల్లో అత్యధికంగా స్కోర్ చేసిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ మ్యాచ్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు చిడం మోహన్ రావు చిడం శివ 3 సయ్యద్ హుస్సేన్ బిఆర్ ఎస్ నాయకులు.
గంప రాంబాబు ముడుంబా శ్రీనివాస్ సిపిఐ నాయకులు తోట మల్లికార్జున రావు వెంకటాపురం సర్పంచ్ తాటి సరస్వతి బిసి మరిగూడెం సర్పంచ్ సురిటి రాజేశ్వర్ బేస్తాగూడెం సర్పంచ్ మడే భీమేశ్వరి మరి కాల సర్పంచ్ కన్నయ్య ఉపసర్పంచులు టోర్నమెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ నగదు పురస్కారానికి అందించిన మన్యం సురేష్ బాబు మన్యం సునీల్ బాబు గోడవర్తి నరసింహమూర్తి వడ్డే శ్రీనాథ్ బాచినేని ప్రవీణ్ కుమార్ దర్గాలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.