టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా గైని శ్రీనివాస్ గౌడ్
22-10-2026 | 10:25pm
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా టిఆర్ఎస్(TRS) అధ్యక్షునిగా గైనీ శ్రీనివాస్ గౌడ్(Gaini Srinivas Goud) నియమించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) నియామ ఉత్తర్వులను జారీ చేసినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో తెలంగాణ రక్షణ సేన పటిష్టవంతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మండల కమిటీలతో పాటు జిల్లా కమిటీని పటిష్టవంతంగా తీర్చిదిద్దుతానని అన్నారు.