జర్నలిస్టు మల్లికార్జున్రెడ్డి రచించిన బాబా పిలుపుతో పుస్తకావిష్కరణ!

22-10-2026 | 10:16pm

సంగారెడ్డి,(విజయక్రాంతి): జర్నలిస్టు కల్వల మల్లికార్జున్ రెడ్డి(Journalist Kalvala Mallikarjun Reddy) రచించిన బాబా పిలుపుతో పుస్తకం ఆవిష్కరణ గురువారం సంగారెడ్డి బైపాస్ రోడ్డు ప్రశాంత్ నగర్ లోని సాయిబాబా ఆలయం(Sai Baba Temple)లో జరిగింది. 2023లో మల్లికార్జున్ రెడ్డి దంపతులు సంగారెడ్డి షిరిడి సాయిబాబా ఆలయం నుంచి షిరిడి సాయిబాబా ఆలయం వరకు 16 రోజులపాటు చేసిన పాదయాత్ర అనుభవాలను ఈ పుస్తకంలో పంచుకున్నారు. గురువారం ఆలయంలో నిర్వహించిన మహా సంప్రోక్షణ కార్యక్రమాల సందర్భంగా ఆయన రచించిన పుస్తకాన్ని భక్తుల సమక్షంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మల్లికార్జున్ రెడ్డి ఆయన సతీమణి లతాశ్రీని సన్మానించి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ రెడ్డి దంపతులు తమ షిరిడీ పాదయాత్రలో ఎదురైన అనుభవాలను, బాబా లీలలను భక్తులతో పంచుకున్నారు. బాబా అనుగ్రహంతోనే పుస్తకాన్ని భక్తులకు అందించగలిగానని పేర్కొన్నారు. ఆలయ పూజారి బసవరాజు, ఆలయ నిర్వాహకులు సూర్యాపేట వీరేందర్‌, బాసుపల్లి ప్రభాకర్‌రెడ్డి, కాశప్ప, నరసయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబా పిలుపుతో పుస్తకాన్ని భక్తులకు అందజేశారు.

మరిన్ని వార్తలు