భగత్ నగర్లో వినాయక నిమజ్జన వేడుకలు
23-09-2026 | 08:12pm
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని భగత్ నగర్ లో గణేష్ నిమజ్జనోత్సవాలు(Vinayaka immersion ceremonies) వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Deputy Mayor Yadagiri Sunil Rao)పలు వినాయక మండపాలను సందర్శించి స్వామివారికి ముగింపు పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహాలను కదిలించి నిమజ్జనానికి తరలించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండపాల నిర్వాహకులు, యూత్ క్లబ్ సభ్యులు, కాలనీవాసులు, స్థానిక నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.