గణేష్ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయం

23-09-2026 | 08:31pm

మాజీ ఎమ్మెల్యే బొల్లం

లడ్డూ వేలం పాటలో  రూ.1,31,116లకు దక్కించుకున్న వ్యాపారి గౌని ఉకలాద్రి, నాగమణి

కోదాడ సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): గణేష్ ఉత్సవాలను క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ గత 35 ఏళ్ళుగా  ఐక్యతతో భక్తి భావాన్ని పెంపొందించేలా నిర్వహించుకోవడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్(Former MLA Bollam Mallaiah Yadav) అన్నారు. బుధవారం కోదాడ క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్తక సంఘం వీధిలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన పూజలు, లడ్డూ పాటలో ఆయన మాట్లాడారు. క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు గట్ల కోటేశ్వరరావు నిర్వహించిన లడ్డూ వేలం పాటలో వ్యాపారి గౌని ఉకలాద్రి రూ.1,31,116లకు లడ్డూను దక్కించుకున్నారు. 

మరిన్ని వార్తలు