తెలంగాణపై ఫోకస్.. కొత్త ఇన్‌చార్జ్‌గా ఆయనా

23-09-2026 | 06:28pm

న్యూఢిల్లీ: తెలంగాణపై బీజేపీ జాతీయ(BJP National) నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా సునీల్ బన్సల్‌ను నియమించింది. ఆయనతో పాటు సహ ఇన్‌చార్జ్‌లుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను నియమిస్తూ బీజేపీ జాతీయ నాయకత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయ ఇన్‌చార్జి తరుణ్ చుగ్ వెల్లడించారు. 

పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు, సహ ఇన్‌చార్జ్‌లను నియమించిన బీజేపీ.. తెలంగాణ బాధ్యతలను సునీల్ బన్సల్‌కు అప్పగించింది. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాల్లో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్‌చార్జ్‌గా డాక్టర్ అరవింద్ భదోరియాను నియమించగా.. సహ ఇన్‌చార్జ్‌గా వనతి శ్రీనివాసన్‌కు బాధ్యతలు అప్పగించారు. పశ్చిమ బెంగాల్ ఇన్‌చార్జ్‌గా కూడా సునీల్ బన్సల్‌ను నియమించారు.

మరిన్ని వార్తలు