గణేష్ ఉత్సవాలపై పోలీసుల అవగాహన కార్యక్రమాలు
23-09-2026 | 08:33pm
జవహర్‌నగర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): గణేష్ సురక్ష సంకల్ప్–2026లో భాగంగా జవహర్‌నగర్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి(Malkajgiri Police Commissioner Sumathi) ఆదేశాల మేరకు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు ప్రతిరోజూ వివిధ అంశాలపై కార్యక్రమాలు చేపట్టారు. గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు, యువతకు ఉత్సవాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జనం సందర్భంగా పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రజల సహకారంతో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.