విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి మృతి
కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ లోని కోతిరాంపూర్ లో నివాసముంటున్న రేకొండ వాస్తవ్యులు మండల వెంకట మల్లయ్య మృతి చెందడం అత్యంత బాధాకరమని వారి కుటుంబానికి తీరని లోటని సిపిఐ(CPI) సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి(Former MLA Chada Venkata Reddy) అన్నారు. బుధవారం రోజున కోతి రాంపూర్ లో వెంకట మల్లయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని చాడ వెంకటరెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ... రేకొండ గ్రామ వాస్తవ్యులైన వెంకట మల్లయ్య విద్యుత్ శాఖ(electricity department)లో ఉద్యోగం పొంది ఉద్యోగ రీత్యా కరీంనగర్ లో స్థిరపడ్డారని, కరీంనగర్ లోని ఈఆర్వో కార్యాలయంలో యుడీసీగా విధులు నిర్వహిస్తూ, సుదీర్ఘ కాలం ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారని, బాధ్యతాయుతంగా వినియోగదారులకు సేవలందించడంలో ముందుండేవారని, కరీంనగర్ లో స్థిరపడినప్పటికీ రేకొండ గ్రామ అభివృద్ధికి ఆయన ఎంతో సేవ కూడా చేశారని, ఆయనతో,వారి కుటుంబానితో 40 ఏళ్లకు పైగా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి కష్ట సుఖాల్లో పాలుపంచుకున్నామని,మంచి మానవత్వం కలిగిన వ్యక్తి వెంకట మల్లయ్య అని,రిటైర్డ్ అయ్యేంతవరకు ఉన్నతాధికారులతో, ప్రజలతో ప్రశంసలు పొందారని గుర్తు చేశారు.
ఇటీవలి కాలంలో అనారోగ్యానికి గురై గత ఆదివారం గుండెపోటుతో మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నట్లు వెంకటరెడ్డి తెలిపారు. నివాళులర్పించిన వారిలో మండల కొమురయ్య,జయలక్ష్మి,సంపత్ కుమారస్వామి,శారద, శ్రీశైలం,మంజుల,ప్రవీణ్ కుమార్,మనోజ్,మండల అనిల్ తదితరులు ఉన్నారు.