ఓసీపై మొక్కలు నాటిన జీఎం

23-09-2026 | 08:39pm

నస్పూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని ఎస్సార్పీ ఓపెన్ కాస్టు గని ప్రాజెక్టు ఆఫీసర్ కార్యాలయం ఎదురుగా ఖాళీగా ఉన్న స్థలంలో శ్రీరాంపూర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బుధ వారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్(Area GM Muniganti Srinivas) మాట్లాడుతూ సింగరేణిలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఏరియా వ్యాప్తంగా ఏటా దాదాపుగా 2 లక్షల మొక్కలు నాటుతున్నామన్నారు.

ఒక హెక్టార్ లో ఐదు రకాల 500 మామిడి మొక్కలు నాటినట్లు వెల్లడించారు. కాలుష్య నియంత్రణ తో పాటు కోతులు ఇతర మూగ జీవాలకు ఆహారం లభించేలా పండ్ల  మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో SRP OCP ప్రాజెక్ట్ ఆఫీసర్ CH వెంకటేశ్వర్లు, మేనేజర్ I శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఇంజనీర్ నాగరాజు, IK OC ప్రాజెక్ట్ ఆఫీసర్ AV రెడ్డి, గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రెటరీ బాజీ సైదా, CMOAI శ్రీరాంపూర్ బ్రాంచి అధ్యక్షులు లక్కాకుల మహేష్, డీజీఎం (ఫారెస్ట్) హరినారాయణ, సివిల్ (హెచ్ఓడీ) రవి కుమార్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు