శాతవాహన లో సిపిజిఈటి స్పాట్ అడ్మిషన్లు ప్రారంభించాలి

04-11-2026 | 05:23pm

పూసల విష్ణు ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ 

ముకరంపుర, నవంబర్ 4 (విజయ క్రాంతి):అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శాతవాహన యూనివర్సిటీ(Satavahana University) శాఖ ఆధ్వర్యంలోబుధవారం వైస్ ఛాన్సలర్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది.శాతవాహన విశ్వవిద్యాలయం(Satavahana University) పరిధిలో సిపిజిఈటి - 2026 మొదటి మరియు రెండవ విడత కౌన్సెలింగ్ తర్వాత కూడా  వందలాది సీట్లు ఖాళీగా మిగిలి పోయాయని క్యాంపస్ తో పాటు,

అనుబంధ కళాశాలల్లో సీట్లు ఖాళీగా ఉండటం వల్ల గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.  కావున విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని శాతవాహన విశ్వవిద్యాలయం వెంటనే స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో నితిన్, రోహిత్,విష్ణు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు