ఊటూరు ఆలయంలో వెండి మీసాలు చోరీ

22-10-2026 | 08:24pm

మానకొండూరు, అక్టోబర్ 22 విజయక్రాంతి: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్ గ్రామంలోని ప్రసిద్ధ మల్లికార్జున స్వామి దేవాలయంలో(Mallikarjuna Swamy Temple) స్వామి వారి వెండి మీసాలను దొంగలు అపహరించారు. విజయదశమి రోజే  గుడి తాళాలు పగులగొట్టి మల్లన్న స్వామి వెండి కోర మీసాలను ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దేవాలయ ప్రెసిడెంట్ కొంగర శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ గోగు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. దసరా రోజు రాత్రి గుర్తు తెలియని దుండగులు ముందు గది,అనంతరం గర్భగుడి తాళాలను చాకచక్యంగా తెరిచి లోపలికి ప్రవేశించారు. స్వామివారి వెండి కిరీటాన్ని వదిలేసి, కేవలం వెండి కోర మీసాలను మాత్రమే ఎత్తుకెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది.చోరీకి గురైన వెండి మీసాల విలువ సుమారు రూ. 20,000 ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు