దేశభక్తికి నిలువెత్తు రూపం పండిత్ దీన్ దయాల్
ముకరంపుర, సెప్టెంబర్ 25(విజయ క్రాంతి) అంత్యోదయ స్పూర్తి ప్రదాత పండిత్ దీన్ దయాల్(Pandit Deendayal, the Inspirer of Antyodaya) ఉపాధ్యాయ అని బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం(Sai Mallesham) కొనియాడారు. బిజెపి కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పార్లమెంట్ కార్యాలయంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ అభివృద్ధే ధ్యేయంగా దీన్ దయాల్ జీవితం కొనసాగిందని పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ప్రతిపాదించిన 'ఏకాత్మ మానవతావాదం' భావజాలం దేశ రాజకీయాలకు, సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకమన్నారు.
'అంత్యోదయ' సిద్ధాంతమే మన మార్గం అని, సమాజంలో అట్టడుగున ఉన్న చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలనే ధ్యేయంతో 'అంత్యోదయ' సిద్ధాంతం కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగానీ శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి ,గుజ్జ శ్రీనివాస్, నగర కార్పొరేటర్లు,బిజెపి నాయకులు, వివిధ మోర్చా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.