విజయవాడ కనకదుర్గమ్మకు కరీంనగర్ చేనేత పట్టుచీరల సమర్పణ
కరీంనగర్,(విజయక్రాంతి): అఖిల భారత పద్మశాలి సంఘం(All India Padmasali Sangham) అధ్యక్షులు కందగట్ల స్వామి నేతృత్వంలో విజయవాడ శ్రీ కనకదుర్గ దేవస్థానం(Sri Kanaka Durga Devasthanam) ట్రస్ట్ బోర్డు సభ్యులు జివినాగేశ్వరరావు, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాల(Dasara Navaratri Celebrations) సందర్భంగా అమ్మవారికి శనివారం చేనేత వస్త్రాలను సమర్పించారు. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు, కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మెతుకు సత్యం సారథ్యంలో 10 రోజులపాటు 10 చేతులతో నేసిన పట్టు చీరలను అమ్మవారికి సమర్పించారు.
చేనేత కళాకారుల చేతి నైపుణ్యంతో తయారైన ఈ చీరలను ఆలయ అర్చకులు అమ్మవారికి అలంకరించనున్నట్లు మెతుకు సత్యం తెలిపారు. చేనేత వస్త్రాలకు పుట్టినిల్లు పద్మశాలి కులస్తుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ సాంప్రదాయాన్ని చాలా సంవత్సరాలుగా పూర్వీకుల నుండి కొనసాగిస్తున్నామని మెతుకు సత్యం తెలిపారు.
ఈ కార్యక్రమంలో అఖిలభారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, వనం విశ్వనాథం, దుష్యంతల, బొళ్ల శివశంకర్, రాపోలు సుధాకర్, బొద్దుల లక్ష్మణ్, గుర్రం శ్రావణ్ కుమార్, గుంటక రూప, మెతుకు మంజుల రాణి, పోరండ్ల శారద, నోముల రేఖ, చిన్నకోట్ల స్వప్న, గుర్రం విశ్వేశ్వర్ రావు, కర్నాటి విజయ్, కైరంకొండ ఉదయ్, మెతుకు వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.