గండిపేటలో ‘నో బిన్‌ – నో ట్రేడ్‌’పై అవగాహన

10-10-2026 | 09:11pm

తడి, పొడి చెత్తకు వేర్వేరు బిన్లు ఏర్పాటు చేయాలి

మణికొండ,(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Cyberabad Municipal Corporation) నార్సింగి సర్కిల్ పరిధిలోని 126వ వార్డు గండిపేట గ్రామంలో శనివారం వ్యాపారస్తులకు ‘నో బిన్‌ – నో ట్రేడ్‌’(No Bin – No Trade) కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ప్రతి వ్యాపార సంస్థలో తడి, పొడి చెత్త కోసం వేర్వేరు బిన్లు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. హానికర వ్యర్థాలను ఇతర చెత్తతో కలపకుండా ప్రత్యేకంగా నిర్వహించాలని తెలిపారు. చెత్తను మూలస్థాయిలోనే వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని, పరిసరాల పరిశుభ్రతను కాపాడేందుకు వ్యాపారస్తులు బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ‘నో బిన్‌ – నో ట్రేడ్‌’ నిబంధనలను ప్రతి వ్యాపార సంస్థ తప్పనిసరిగా పాటించాలని, నిబంధనల అమలుతోనే పరిశుభ్రమైన పరిసరాలు, ప్రజారోగ్య పరిరక్షణ సాధ్యమవుతాయని అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు