ఫ్యాక్స్ డైరెక్టర్‌గా తిరుపతి యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నిక
తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం(Toopran Mandal) మల్కాపూర్ కాంగ్రెస్ కార్యకర్త తిరుపతి యాదవ్(Tirupati Yadav) ఇటీవల కాలంలో తూప్రాన్ ఫ్యాక్స్ చైర్మన్ ఉమ్మన్నగారి భాస్కర్ రెడ్డి తో పాటు డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫ్యాక్స్ చైర్మన్ ఉమ్మన్నగారి భాస్కర్ రెడ్డి(PACS Chairman Ummannagari Bhaskar Reddy) ప్రోద్బలంతో గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ(Congress Party) నిర్వహించిన అనేక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడంతో ఈ అవకాశం దొరకడం జరిగింది.
అవకాశం కల్పించిన ఫ్యాక్స్ చైర్మన్ భాస్కర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. నాకు కల్పించిన ఈ అవకాశాన్ని సొంత లాభం కోసం కాకుండా పార్టీ మనుగడ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందులో తూప్రాన్ మండల ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు దోమలపల్లి కృష్ణ, యూత్ ప్రెసిడెంట్ శశిభూషణ్ రెడ్డి, ఆకుల శ్రీరాములు, బి.యన్. తిరుపతి రెడ్డి, పోతిరెడ్డి తిరుపతిరెడ్డి, లల్లిపాటి రామచంద్రారెడ్డి, తదితరులు ఉన్నారు.