పూల పండుగకు పులకించిన గంగుల నివాసం

10-10-2026 | 09:57pm
  1. సంప్రదాయాల సోయగం.. సంస్కృతి వైభవం
  2. అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

కరీంనగర్‌ సిటీ,అక్టోబర్10(విజయాక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ(Bathukamma Festival) సంబరాలు మాజీ మంత్రి, కరీంనగర్‌ శాసనసభ్యులు గంగుల కమలాకర్‌(Gangula Kamalakar) నివాసంలో అంబరాన్నంటాయి. పూలను దైవస్వరూపంగా భావించి ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ పండుగ ఎంగిలిపూల బతుకమ్మను గంగుల కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల నడుమ సంప్రదాయ పాటలు, ఆటలతో ఇంటి ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.

వివిధ రకాల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఇంటి వాకిట్లో కొలువుదీర్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు రకాల నైవేద్యాలను సమర్పించి బతుకమ్మకు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సంప్రదాయ బతుకమ్మ పాటలు ఆలపిస్తూ, లయబద్ధంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ చుట్టూ ఆడిపాడారు. తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో గంగుల కమలాకర్‌ సతీమణి గంగుల రజిత, గంగుల కుటుంబీకులు.. శారద, గీత,  సునీత తోపాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు