కృత్రిమ మేధస్సు, సామర్థ్యం, వాస్తవ ఉపయోగాలపై అవగాహన
ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయం(Anurag University) కృత్రిమ మేధస్సు విభాగం, ఐఈఈఈ సిఐఎస్ సహకారంతో ఏఐ ఐక్యం ఆలోచనలను ఏకం చేసి, ఆవిష్కరణలకు స్ఫూర్తినిద్దాం అనే కార్యక్రమాన్ని అనురాగ్ విశ్వవిద్యాలయంలోని ఈ-బ్లాక్ ఆడిటోరియంలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు, ఆవిష్కర్తలు, కృత్రిమ మేధస్సుపై ఆసక్తి ఉన్నవారు పాల్గొన్నారు. కృత్రిమ మేధస్సు((AI Unity)) అనువర్తనాలు, సామర్థ్యం, వాస్తవ ప్రపంచంలో దాని ఉపయోగాలపై పాల్గొనే వారికి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిలిచింది.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బోతుల పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. గౌరవ అతిథులుగా ఎర్రబాబు ప్రోడక్ట్ ఓనర్ ధీరజ్ కుమార్ రెడ్డి, కోపౌండర్ రీనే (రేష్మి) డీన్ డాక్టర్ వి. విజయ్ కుమార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి డాక్టర్ ఎం. తృప్తి పాల్గొన్నారు. ముఖ్యఅతిథి బూతుల పవన్ కుమార్ మాట్లాడుతూ టెక్నాలజీ రంగంలో తన వృత్తిపరమైన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై పరిశ్రమకు సంబంధించిన విలువైన సూచనలు అందించారు.