ఇస్లాంపూర్ లో మొదలైన బతుకమ్మ సంబరాలు
10-10-2026 | 09:59pm
తూప్రాన్, అక్టోబర్ 10, (విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం(Toopran Mandal) ఇస్లాంపూర్ గ్రామంలో ఇస్లాంపూర్ మహిళలు మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మను తయారు చేసుకుని గ్రామపంచాయతీ(Gram Panchayat) వద్ద ఉన్న దేవాలయ ప్రాంగణంలోకి తీసుకొని వచ్చి భక్తితో ఆట పాటలతో అలరించారు. గ్రామ సర్పంచ్ గొల్లపల్లి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు కావలసిన ఏర్పాట్లను చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం నుండి మొదలు చివరి రోజు సద్దుల బతుకమ్మ వరకు గ్రామంలోని మహిళ తల్లులతో సంబరాలు ఘనంగా నిర్వహించబడతాయని గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి తెలిపారు.