టాలెంట్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
సత్తుపల్లి అక్టోబర్10( విజయక్రాంతి) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను టాలెంట్ స్కూల్(Talent School), శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు(Female students) రంగు,రంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.
విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. పండుగ ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఐకమత్యం, ప్రకృతి పరిరక్షణ వంటి విలువలను విద్యార్థులకు తెలియజేశారు.ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో విద్యార్థుల్లో మన సంప్రదాయాల పట్ల గౌరవం, సాంస్కృతిక,చైతన్యం పెంపొందుతాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పులి శ్రీనివాస్ రావు, ప్రిన్సిపాల్ పులి అరుణ, పాఠశాల ఇన్‌చార్జ్ శంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.