గిరిజనులపై దాడులు సరైన పద్ధతి కాదు
నాగిరెడ్డిపేట్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): మండలంలోని బొల్లారం గ్రామం(Bollaram Village) పల్లెబోగుడా తండాలో జరిగిన అటవీ శాఖ అధికారులు(Forest Department officials) గిరిజనుల మధ్య ఘర్షణలో మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకోవడం జరిగింది. ఎల్లారెడ్డి ప్రైవేట్ ఆసుపత్రిలో(Yellareddy Private Hospital) చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించడానికి ఆల్ ఇండియా బంజారా సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేందర్ రాథోడ్(Surender Rathod) వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అటవీశాఖ అధికారులు గిరిజనులపై చేస్తున్నదాడులు సరికాని ట్రాక్టర్లను స్వాధీనం చేసుకునే ముందు వారికి నోటీసులు ఇవ్వాలని గతంలో పోడు పట్టాలు వచ్చిన పొలాలలో పంట వేయకుండా ఆపడం దుర్మార్గమైన చర్య అని దీనిని మేము తీవ్రంగా ఖండి అటవీశాఖ అధికారులు గిరిజనులపై దాడులు చేసే ముందు పోడు పట్టాలు వచ్చాయా రాలేవని తీసుకోవాలి.కానీ దాడులు చేయడం మంచిదని అన్నారు.దీనికి పూర్తి బాధ్యత అటవీ శాఖ అధికారులు వహించాల్సి వస్తుంది ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.