యాసంగిలో నీటిని తక్కువగా వినియోగించే పంటలు సాగు చేయాలి
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల్లో ఎల్నినో పరిస్థితుల(El Nino Impact) మీద సమీక్ష నిర్వహించడం జరిగింది.దాంట్లో భాగంగా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో రైతు వేదికలో సమీక్ష సమావేశంలో అధికారులు రైతులు(Farmers) తదితరులు పాల్గొని వీక్షించారు. ఎల్నినో వలన వర్షాలు తక్కువ కురవడంతో యాసంగిలో నీటిని తక్కువ వినియోగించే పంటలు పండించి నీటిని సమగ్రంగా వినియోగించాలని సూచించారు. నీటిని తక్కువ వినియోగించే పంటలు అయినటువంటి పప్పు దినుసులు, నూనె గింజలు వంటివి పండించాలని సూచించారు.
భూగర్భ జలాలు(Groundwater) అడుగుకు చేరడంతో రైతులు వరి సాగు చేయవద్దని సూచించడంతో పాటు నీటి ఎద్దడి దృశ్య ఆరుతడి పంటల వైపు మల్లాలని సూచించారు. ఎల్నినో ముప్పు ప్రపంచ వ్యాప్తముగా ఉన్నందున రైతులు నీటికి పొదుపుగా వాడుకుంటూ ఆరుతడి పంటల పండించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మాల్తుమ్మెద సొసైటీ చైర్మన్ సురేందర్ గౌడ్, డైరెక్టర్ మునిగేపల్లి సంగయ్య, వజ్ర నాయక్,గంపల వెంకన్న, ఆత్మ కమిటీ డైరెక్టర్లు దివిటీ కిష్టయ్య, లక్ష్మణ్ ఠాగూర్, ఎంపీఓ ప్రభాకర్ చారి, ఏపీవో సక్కుబాయి, సిపిఎం దత్తు, సీఈవో సందీప్ కుమార్, సైంటిస్టు రేవంత్, ఏవో సాయికిరణ్, ఐకెపిసిసిలు, ఏఈవోలు పాల్గొన్నారు.