Breaking News

గట్టు రమేష్ గౌడ్ కు మెడికల్ ఫిజిక్స్ లో పిహెచ్డి

09-09-2026 | 05:23pm

మానకొండూరు,(విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) మానకొండూర్ మండలం శంషాబాద్ గ్రామానికి చెందిన గట్టు రమేష్ గౌడ్ మెడికల్ ఫిజిక్స్(Medical Physics) రంగంలో విశేష ప్రతిభను కనబరుస్తూ పీహెచ్‌డీ (Ph.D.) పట్టా సాధించారు. ఇటీవల జరిగిన 85వ స్నాతకోత్సవం (85th Convocation)సందర్భంగా తెలంగాణ గవర్నర్  శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఆయన డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. గట్టు రమేష్ గౌడ్ మెడికల్ ఫిజిక్స్‌లో తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి డాక్టరేట్ సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, మిత్రులు, సహచరులు, శంషాబాద్ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఉన్నత విద్యలో రాణిస్తూ, వైద్యరంగానికి అత్యంత కీలకమైన మెడికల్ ఫిజిక్స్ ప్రత్యేక శాస్త్రీయ విభాగంలో పీహెచ్‌డీ సాధించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి విద్యారంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి, రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకోవడం శంషాబాద్ గ్రామానికే గర్వకారణమని గ్రామస్థులు పేర్కొన్నారు. భవిష్యత్తులో మెడికల్ ఫిజిక్స్ రంగంలో మరింత విస్తృతంగా పరిశోధనలు చేపట్టి, క్యాన్సర్ చికిత్సతో పాటు వైద్యరంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని గట్టు రమేష్ గౌడ్ చెప్పారు.

మరిన్ని వార్తలు