డివిజన్లలో అభివృద్ధి జోష్‌

29-09-2026 | 01:47pm

ముకరంపుర, సెప్టెంబర్ 29(విజయ క్రాంతి): నగర సమగ్ర అభివృద్దే లక్ష్యంగా మా పాలకవర్గం శ్రమిస్తోందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్(Mayor Kolagani Srinivas) స్పష్టం చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా మంగళవారం డిప్యూటీ మేయర్(Deputy Mayor) యాదగిరి సునీల్ రావుతో కలిసి మేయర్ కొలగాని శ్రీనివాస్ 19, 49వ డివిజన్లలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొదటగా 49వ డివిజన్ విద్యానగర్ ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ ఎన్నం లక్ష్మీ ప్రకాష్ తో కలిసి నగరపాలక సంస్థకు చెందిన రూ. 10 లక్షల సాధారణ నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులను భూమీ పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం 19వ డివిజన్ హరిహర నగర్‌లో స్థానిక కార్పొరేటర్ సుధగోని మాధవి కృష్ణ గౌడ్‌, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలిసి నగరపాలక సంస్థ సాధారణ నిధులు రూ. 20 లక్షలతో  సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని... ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లకు ఆదేశించారు. 

​ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ నగర ప్రజలు, పాలకవర్గ సభ్యలు మా దృష్ఠికి తెచ్చిన ప్రతి సమస్యను పరిగణలోకి తీస్కోని దశలవారీగా అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. నగరంలో యూఐడిఎఫ్ కు చెందిన 50 కోట్ల నిధులతో డివిజన్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు ప్రారంభం చేసి వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీస్కోవడం జరుగుతుందని తెలిపారు. సంబంధించిన నిధుల అభివృద్ధి పనులను పూర్తి చేసి మరో 30 కోట్ల నిధులతో డివిజన్లలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమాల్లో డీఈ శ్రీనివాస్, స్థానిక ప్రజలు, మున్సిపల్ సిబ్బంది  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు